Sugunaala Sampannudaa

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నీవే నీవే నా రాజువయ్యా (2)

యేసయ్య యేసయ్య యేసయ్యా…


కొండలలో లోయలలో

అడవులలో ఎడారులలో (2)

నన్ను గమనించినావా

నన్ను నడిపించినావా (2)        ||యేసయ్యా||


ఆత్మీయులే నన్ను అవమానించగా

అన్యులు నన్ను అపహసించగా (2)

అండ నీవైతివయ్యా

నా.. కొండ నీవే యేసయ్యా (2)      ||యేసయ్యా||


మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ

నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)

నన్ను బలపరచెనయ్యా

నిన్నే ఘనపరతునయ్యా (2)      ||యేసయ్యా||


వంచెన వంతెన ఒదిగిన భారాన

ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)

కలలా కడతేర్చినావా

నీ వలలో నను మోసినావా (2)      ||యేసయ్యా||

Comments

Popular posts from this blog

Ninne Ninne Ne Koluthunayyaa

Hosannanuchu Sthuthi Paaduchu